త్వరగా ధాన్యం తరలించండి | - | Sakshi
Sakshi News home page

త్వరగా ధాన్యం తరలించండి

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

నర్సాపూర్‌ రూరల్‌: ధాన్యం త్వరగా తరలించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలంలోని కాగజ్‌మద్దూర్‌ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా రైతులు తమ గోడును ఎమ్మెల్యేకు విన్నవించారు. గోనె సంచులు, లారీల కొరత కారణంగా వడ్లు తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు వడ్లు తడవడంతో పాటు నిద్రాహారాలు మాని ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌కు ఫోన్‌ చేశారు. కాగజ్‌మద్దూర్‌, నత్నయపల్లి, కొండాపూర్‌ తదితర గ్రామా లకు గోనె సంచులు, లారీలను పంపి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రగౌడ్‌, నాయకులు శేఖర్‌, మాజీ సర్పంచ్‌లు పరమేశ్వర రాజు, శంకరయ్య, రైతులు ఉన్నారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement