చేగుంట(తూప్రాన్): మండలంలోని జెత్రం తండాలో రెండు వారాలుగా మిషన్ భగీరథ నీటిని సరఫరా జరగకపోవడంతో తండా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరవై రోజుల క్రితం భగీరథ ప్రధాన పైపులైన్‌లో మరమ్మతులు చేస్తున్నారని, గ్రామాల్లో మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ నీటి సౌకర్యాలను వినియోగించుకోవాలని అధికారులు అన్ని గ్రామాల సర్పంచులకు సూచించారు. కానీ నాటి నుంచి తండాకు భగీరథ నీరు సరఫరా కావడం లేదు. గిరిజనుల సౌకర్యం కోసం సర్పంచ్ సుభాష్‌నాయక్ ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా తండావాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి కోసం వ్యవసాయ బోరు బావులను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భగీరథ నీటిని సరఫరా చేయాలని, లేకుంటే మండల కేంద్రంలో బిందెలతో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తున్నారు.


