గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్
గజ్వేల్: వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ హెచ్చరించారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రమ నిర్మాణాలు చేసిన వారికి గతంలో స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశామని, అయినా వాటిని ఉల్లఘించినందువల్ల కూల్చివేత చర్యలు చేపట్టినట్లు కమిషనర్ పేర్కొన్నారు.


