బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల మూడు నెలల బకాయిలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో గ్రామపంచాయతీ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామపంచాయతీ కార్మికులు కష్టపడి గ్రామాన్ని పరిశుభ్రంగా తయారు చేస్తున్నారని, ప్రతినెల వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి వేతనాలు రాకుంటే వారు ఎలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు రెగ్యులర్‌గా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సత్తయ్య, దశరథ్‌, నాయకులు పోచయ్య, యాదమ్మ ,నగేశ్‌ , ఆనంద్‌, బాలయ్య, శంకర్‌, లక్ష్మణ్‌, రాములు, ఎల్లయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement