● నలుగురు ఉపాధి మహిళా కూలీలకు గాయాలు
● సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలింపు
సిద్దిపేటరూరల్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై మట్టిదిబ్బ కూలగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రూరల్ మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామంలో రోజువారీగా కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న మట్టి కుప్ప కూలింది. దీంతో నలుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కూలీలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యం అనంతరం సర్పంచ్, తదితరులు వారిని ఇంటికి తీసుకువచ్చారు.


