ఆహా.. ఆవకాయ | - | Sakshi
Sakshi News home page

ఆహా.. ఆవకాయ

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

ప్రారంభమైన పచ్చళ్ల సీజన్‌

సంగారెడ్డి క్రైమ్‌ / హత్నుర(సంగారెడ్డి): వేసవిలో అటు గ్రామంలో.. ఇటు పట్టణంలో.. ఎక్కడ చూసినా మామిడికాయ పచ్చళ్ల తయారీతో సందడి నెలకొంది. పచ్చళ్లు నేటికి మన సంస్కతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రుచిని పెంచడమే కాక ఆహారాన్ని సంరక్షించే సంప్రదాయ పద్ధతిగా కూడా పనిచేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో ఆవకాయ పచ్చడి లేని ఇల్లు ఉండటమే ఆశ్చర్యం. బెల్లం – మామిడికాయ, మెంతి – ఆవకాయ పచ్చడి, పులిహోర ఆవకాయ పచ్చడీ వంటి రకాలు ప్రాంతాలను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఈ పచ్చళ్ల తయారీ ప్రక్రియలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణతోపాటు పాత తరం నుంచి కొత్త తరానికి జ్ఞానాన్ని అందించడం వంటి సంస్కృతి, సంబంధాలను బలపరుస్తాయి.

పచ్చడి తయారీ చేసే విధానం..

గట్టిగా, పుల్లగా ఉన్న పచ్చి మామిడికాయలను ఎంచుకొని లోపల టెంకలు తీసి ముక్కలుగా కోయాలి. ఆగపిండి. ఎండు కారం, ఉప్పు, మెంతిపొడి, నువ్వుల నూనె వంటి ప్రధాన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. కొన్ని రకాల్లో బెల్లం, వెల్లుల్లి కూడా కలుపుతారు. ఆ తర్వాత జాడీలో లేదా కుండల్లో కారం మిశ్రమాన్ని మామిడి ముక్కలతో పొరలు పొరలుగా అమర్చి పైన నూనె పోస్తారు. ఇది పచ్చడిని పాడవకుండా కొన్ని నెలలు సంరక్షిస్తుంది. 34 రోజులపాటు గాలి చొరబడకుండా మూత పెట్టి ఉంచిన తర్వాత తినడానికి తయారవుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

మామిడికాయ పచ్చళ్లు రుచికరమైనవే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. పచ్చి మామిడిలో పొటాషియం ఇతర ఖనిజాల వల్ల వేసవిలో డీ హైడ్రేషన్‌, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతాయి. జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మార్కెట్‌లో పచ్చడి మామిడికి డిమాండ్‌

సామగ్రి కొనుగోలు చేస్తున్న ప్రజలు

ఏడాదికి సరిపడా కుటుంబంతో కలిసి తయారీ

Advertisement
 
Advertisement
Advertisement