దుబ్బాకరూరల్: మండలంలోని హబ్సిపూర్ గ్రామానికి చెందిన నాగరాజ్, శశిరేఖ దంపతుల కుమారుడు నిహిత్ కీబోర్డు వాయించడంలో ప్రతిభ కనబరిచాడు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన కీబోర్డు వాయిద్యా పోటీల్లో 22 దేశాల నుంచి 2వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. గంటకు పైగా కీ బోర్డు వాయించడంలో 777మంది విద్యార్థులు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకు ఎంపికయ్యారు. ఎంపికై న నిహిత్‌ను హైదరాబాద్‌లోని హెల్లెల్ మ్యూజిక్ స్కూల్ పాఠశాల యాజమాన్యం గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డు ప్రశంసా పత్రం అందజేసి సన్మానించింది.
మహిళా శిశు సంక్షేమ శాఖ
ప్రిన్సిపల్ సెక్రటరీ
సిద్దిపేటఅర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక బాల్య వికాసం (ఈసీడీ) కార్యక్రమాల అమలును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన బాలనేగి పేయింటింగ్స్, పిల్లల అభ్యాసానికి అనుకూలంగా రూపొందించిన విద్యా వాతావరణం, ఆటల ద్వారా నేర్చుకునే విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారుల మెదడు వికాసం, ప్రీ–స్కూల్ విద్య, స్కూల్ రెడినెస్, మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత, పోషకాహారం, తల్లిదండ్రుల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు.


