● కోతుల బెడద ఉండదు
● ఏఓ స్వప్న
కౌడిపల్లి(నర్సాపూర్): ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని, కోతుల బెడద ఉండదని ఏఓ స్వప్న తెలిపారు. శుక్రవారం మండలంలోని నాగ్సాన్‌పల్లిలో ఆయిల్‌పామ్‌సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో రైతులు కోతుల బెడద కారణంగా పంటమార్పిడి చేయడం లేదని చెబుతున్నారని తెలిపారు. కాగా ఆయిల్‌పామ్ సాగుకు కోతుల బెడద ఉండదని, ఒక్కసారి సాగుచేస్తే నాలుగేళ్ల నుంచి ఏళ్ల తరబడి ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ అందజేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, మాజీ సర్పంచ్ ఎల్లం, ఏఓ నరేందర్, ఆయిల్‌పామ్ మేనేజర్ కృష్ణారావ్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్, ఉదయ్, రైతులు కృష్ణ, రాములు, లక్ష్మణ్ పాల్గొన్నారు.


