చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ నాగేశ్వరరావ్
కౌడిపల్లి(నర్సాపూర్): భారతి సిమెంట్ నాణ్యతలో మేటి అని చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ నాగేశ్వర రావ్ అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావ్‌పేట గేట్ వద్దగల సాయి తిరుమల ట్రేడర్స్ ఆధ్వర్యంలో తాపీ, సెంట్రింగ్ మేసీ్త్రలకు సమావేశం నిర్వహించి భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్మాణ రంగంలో భారతి సిమెంట్ అత్యంత ఉత్తమమైనదన్నారు. వికాట్ గ్రూప్ కంపెనీ ప్రపంచంలోని 12దేశాల్లో విస్తరించి ఉందని చెప్పారు. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా అత్యుత్తమ ప్రమాణాలతో ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. పిల్లర్లు, స్లాబులు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి భారతి సిమెంట్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ సందర్భంగా తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ఇన్సూరెన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్, సేల్స్ ఆఫీసర్ గంగాధర్, భారతీ సిమెంట్ డీలర్లు రాజశేఖర్‌రెడ్డి, మల్లేశ్, కార్మికులు పాల్గొన్నారు.


