నారాయణఖేడ్: పంట అవశేషాలను కాల్చవద్దని ఖేడ్ ఏడీఏ నూతన్ కుమార్ రైతులకు సూచించారు. పంట సాధారణ వ్యర్థాలను కాల్చితే రూ.5 వేలు, భారీ స్థాయిలో వ్యర్థాలు కాల్చితే రూ.25 వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించారు. వ్యర్థాలను కాల్చకుండా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు.
ఎర్రరాయి లారీ పట్టివేత
న్యాల్‌కల్(జహీరాబాద్): కర్ణాటక ప్రాంతం నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వస్తున్న ఎర్రరాయి లారీని గురువారం హద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక ప్రాంతం బీదర్ నుంచి లారీలో సుమారు 400 ఎర్రరాళ్లను తీసుకువస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు న్యాల్‌కల్ తండా వద్ద కాపుకాశారు. లారీ అక్కడకు చేరుకోగానే లారీని తనిఖీ చేయగా ఎటువంటి అనుమతుల్లేకుండా ఎర్రరాళ్లను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో లారీని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. డ్రైవర్ రాథోడ్ శ్రావణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారభించినట్లు ఎస్సై దోమ సుజిత్ వివరించారు.
Ķ欧ýl®-{´ë-†-ç³-¨-MýS¯]l «§é¯]lÅ… Mö¯]l$-Vøâ¶æ$Ï: MýSÌñæMýStÆŠḥæ
మెదక్ కలెక్టరేట్: అకాలవర్షంతో తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో తడిసిన సుమారు 4 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులను తరలించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 62,103 మంది రైతుల నుంచి 2,85,054.080 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. 30 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ముగిసిందన్నారు. రైతులు ధాన్యం సమస్యలపై 9391942254 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. అనంతరం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
అన్‌లోడింగ్ వేగవంతం
కొల్చారం(నర్సాపూర్): రైస్ మిల్లులకు ధాన్యం లోడుతో వచ్చిన లారీల అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. గురువారం మండలంలోని వరిగుంతం శివారులోని రైస్ మిల్లును సందర్శించారు. గోదాంలో అన్‌లోడింగ్ చేసే సమయాన్ని రాత్రి 10 గంటల వరకు చేపట్టాలని ఆదేశించారు. ఖాళీ అయిన లారీలను అవసరమైన కొనుగోలు కేంద్రాలకు వెళ్లేలా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
వర్గల్(గజ్వేల్): కావేరి యూనివర్సిటీ వై్‌స్ చాన్సలర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావుకు రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఈ మేరకు ఆ యూనివర్సిటీ చాన్సలర్ జీ.భాస్కర్‌రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురువారం హర్యానాలోని ఎంపీహెచ్‌యూ వేదికగా నిర్వహించిన జాతీయ సదస్సులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌షైనీ చేతుల మీదుగా సీహెచ్‌ఏఐ(చాయ్) హానరరీఫెలో –2026, అమిత్ కృషి రుషి అవార్డు–2026 లను వీసీ ప్రవీణ్‌రావు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డులు వర్సిటీకి గర్వకారణమన్నారు. వ్యవసాయ, ఉద్యాన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనాభివృద్ధి, విద్యాసంస్థల బలోపేతానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డులు వరించాయన్నారు.


