చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్‌

May 28 2026 8:43 AM | Updated on May 28 2026 8:43 AM

● బంగారు ఆభరణాలు స్వాధీనం ● కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ

● బంగారు ఆభరణాలు స్వాధీనం ● కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ

హుస్నాబాద్‌రూరల్‌: ఆభరణాల చోరీ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఏసీపీ సదానందం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని పోతారం(ఎస్‌)కు చెందిన బొయిని మంజుల రాత్రి తన ఇంటి ముందు వరండాలో నిద్రించారు. కాగా ఆమె మెడలోని పుస్తెలతాడు, బంగారు చైన్‌ను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మంజుల చెల్లెలు బోయిని విజయభారతిని అదుపులోకి తీసుకొని విచారించారు. తన అక్క మెడలోని పుస్తెలతాడు, బంగారు చైన్‌ను వైర్‌ కట్టర్‌తో కట్‌ చేసి చోరీ చేసినట్లు ఒప్పుకుంది. ఎవరికి అనుమానం రాకుండా తన అక్క కూతురు చెవి కమ్మలను తీసి, దొంగిలించిన నగలతో కలిపి ఇంటి ముందు గోళం కింద దాచిపెట్టి ఇంట్లో దొంగతనం జరిగినట్లు చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. నిందితురాలి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement