మెప్మా పీడీ హన్మంతరెడ్డి
మెదక్ కలెక్టరేట్: చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ప్రభుత్వ ప్రయోజనాలు పొందవచ్చునని మెప్మా పీడీ హన్మంతరెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ పట్టణంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడో రోజు మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలతో ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారాలను సందర్శించామని చెప్పారు. ఈ సందర్భంగా మెప్మా రిసోర్స్ పర్సన్‌న్‌ల ద్వారా ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌న్ పోర్టల్‌లో వారి వ్యాపా రాలను రిజిస్ట్రేషన్‌న్ చేయించినట్లు తెలిపారు. తద్వారా చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చునని వివరించారు. కార్యక్రమంలో మెప్మా రిసోర్స్ పర్సన్లు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.


