విస్తృతంగా డ్రంకెన్‌డ్రైవ్ ఏప్రిల్‌లో 60 మందికి రూ.6 లక్షల ఫైన్ మూడేళ్లలో 26 వేల మందికి ఫైన్ వేసిన కోర్టు
మెదక్‌జోన్: మందు తాగి వాహనం నడిపి డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వారికి న్యాయస్థానం రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తోంది. తాగి ఒక్కసారి దొరికారా? రెండోసారా అనే లెక్కలు పక్కన పెట్టి.. తాగి వాహనం నడిపితే చాలు పదివేలు కట్టాల్సిందే. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 60 మంది మందుబాబులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున కోర్టు రూ. 6 లక్షల జరిమానా విధించింది. అలాగే గడిచిన మూడేళ్లలో జిల్లాలో 26, 826 మంది డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడగా, వారిలో 25,455 మందికి రూ.1,87,57,939 జరిమానా రూపంలో కోర్టు విధించింది. కాగా గతంలో తాగి మొదటి సారి డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడితే రూ.వెయ్యి , రెండోసారి రూ.2 వేలు, ఆ తరువాత మళ్లీ పట్టుబడితే జరిమానాతో పాటు స్వల్ప జైలు శిక్షను సైతం అమలు చేశారు. కానీ ఇప్పుడు తాగి పట్టుబడితే చాలు రూ. 10 వేలు కట్టాల్సిందే.
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు!
రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం ప్రమాదాలు మద్యం మత్తులోనే వాహనాలు నడపటం వల్లే అవుతున్నాయని, సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంతో మంది చనిపోతున్నారని, ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలవుతున్నట్లు పోలీసుల సర్వేలో తేలింది. దీన్ని కట్టడి చేసేదుకు పోలీసు అధికారులు విస్తృతంగా డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన మందుబాబులను న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. దీంతో కోర్టు కొన్ని నెలలుగా రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తోంది. దీంతో తాగి వాహనం నడపద్దు అనే చర్చ ప్రజల్లో మొదలైంది. కాగా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
పట్టుబడితే రూ.10 వేల జరిమానా
తాగి వాహనం నడపవద్దు
మద్యం తాగి వాహనం నడిపితే ఎవరినైనా ఉపేక్షించేదిలేదు. మద్యం మత్తులో వాహనం నడిపి ఎదుటివారిని ఢీకొట్టడం వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు డ్రంకెన్‌డ్రైవ్ టెస్టులు విస్తృతంగా చేస్తున్నాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ, మెదక్ జిల్లా


