● రూ. 93 లక్షలతో వీధి దీపాల పనులకు శంకుస్థాపన ● టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
సదాశివపేట(సంగారెడ్డి): మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని గాంధీచౌక్ వద్ద రూ.93 లక్షల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టిన వీధి దీపాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ సమావేశం మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సదాశివపేటలో మహిళలకు పెట్రోల్ పంపు మంజూరు చేయిస్తానని తెలిపారు. మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సిద్దాపూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో బక్రీద్ పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శివాజీ, మున్సిపల్ చైర్‌పర్సన్ అంజమ్మ, వైస్‌చైర్ పర్సన్ రేణుక, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, కౌన్సిలర్లు అనిత, సెజ్జీ, అరుణ్‌కుమార్, వాజీద్, కోఆప్షన్ మెంబర్ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కృష్ణ, డైరెక్టర్ చిరు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజ్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు తుల్జరామ్, శరత్‌గుప్త, రమేశ్, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.


