ఐదుగురు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఐదుగురు అదృశ్యం

May 28 2026 8:43 AM | Updated on May 28 2026 8:43 AM

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యమయ్యారు.

టేక్మాల్‌(మెదక్‌): వివాహిత అదృశ్యమైన సంఘటన మండలంలోని చంద్రుతండాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అరవింద్‌కుమార్‌ కథనం ప్రకారం... తండాకు చెందిన రమావత్‌ సర్దార్‌, రాణి దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయంతో పాటు మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నిత్యం మాదిరిగానే మంగళవారం సర్దార్‌ మేకలను మేపెందుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఆయన కుమారుడు ఫోన్‌ చేసి ఇంటి వద్ద అమ్మలేదని చెప్పాడు. సర్దార్‌ ఇంటికి వచ్చి పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.

ఖాజాపూర్‌లో తల్లీముగ్గురు పిల్లలు..

చిన్నశంకరంపేట(మెదక్‌): ముగ్గురు పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ సంఘటన మండలంలోని ఖాజాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శివానందం కథనం ప్రకారం... గ్రామానికి చెందిన యాడారం స్వామికి శిరీషతో 2010లో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నెల 24న స్వామి గ్రామంలో పోచమ్మ పండుగ విషయం మాట్లాడేందుకు వెళ్లగా, శిరీష తన ముగ్గురు పిల్లలు స్పందన, సంజన, ఆధ్యశ్రీని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. స్వామి ఇంటికి వచ్చి చూడగా కన్పించకపోవడంతో ఫోన్‌చేయగా తాను ఊర్లో ఉన్నానని ఇంటికి వస్తున్నానని చెప్పింది. తీరా ఇంటికి రాకపోగా ఫోన్‌కూడా స్విచ్చాఫ్‌ అయింది. దీంతో తెలిసినవారి ఇళ్లలో, బంధువుల వద్ద ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు. భర్త బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement