శివ్వంపేట (నర్సాపూర్): గుర్తుతెలియని వ్యక్తులు కిరాణం డబ్బాతో పాటు టీ స్టాల్‌లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా... చండీ– గోమారం ప్రధాన రహదారి పక్కన రెడ్యా తండా వద్ద అదే తండాకు చెందిన బీమా కిరాణం డబ్బా ఏర్పాటు చేసుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు డబ్బా షట్టర్ తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి అందులోని నగదు, సిగరెట్లు, కిరాణం సామగ్రిని ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న టీస్టాల్‌లో కూడా కొంత నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు చోరీ ప్రదేశాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
ఎస్సీ హాస్టల్‌లో
పాముల కలకలం
మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌కు నిత్యం పాములు వస్తున్నాయని, దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం సైతం రెండు పాములు రావడంతో చంపేశారని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాత్రూమ్‌లోకి పాములు వస్తున్నాయని, దీంతో విద్యార్థులు అటు వైపు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ స్పందించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు గణేశ్, చింటూ, విష్ణు, దుర్గేశ్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.


