పాలిసెట్‌లో అమీన్‌పూర్‌ విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో అమీన్‌పూర్‌ విద్యార్థి ప్రతిభ

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

స్టేట్‌ ఫస్ట్‌ వచ్చిన హరికృష్ణ

పటాన్‌చెరు టౌన్‌: పాలిసెట్‌ పరీక్షల్లో అమీన్‌పూర్‌ గణేశ్‌ నగర్‌కు చెందిన అన్నం గంగాధర్‌(ప్రైవేట్‌ టీచర్‌), భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు హరికృష్ణ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. శనివారం విడుదలైన ఫలితాల్లో ఎంపీసీ స్ట్రీమ్‌లో 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించిన హరికృష్ణను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు, ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

విద్యార్థి హరికృష్ణ

Advertisement
 
Advertisement
Advertisement