బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గాగిళ్లాపూర్ రాయికుంటలో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎండిన గడ్డి, చెత్త ఉండటంతో మంటలంటుకొని పొగలు వ్యాపించాయి. చెరువు సమీపంలోని ఇండ్లకు మంటలు వ్యాపిస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ మంటలు ఆర్పేందుకు యువకులు ప్రయత్నించారు. సర్పంచ్ జానకి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్‌తో మంటలార్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
కాలి బూడిదైన మోటార్ కేబుల్స్, పైపులు
దుబ్బాకరూరల్: ఒక్కసారిగా గాలి దుమారం రావడంతో పొలంలో స్తంభం మీదుగా ఉన్న కరెంట్ వైర్లు ఒక దానికొకటి తగలడంతో మంటలు చెలరేగాయి. దీంతో పొలంలో ఉన్న గడ్డి దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చుట్టు పక్కల ఉన్న పొలాలకు వ్యాపించాయి. బోర్ మోటార్లకు ఉన్న కేబుల్ వైర్లు, స్టార్టర్లు, పైపులు కాలి బూడిదయ్యాయి. రైతులకు కొంత మేర ఆస్తి నష్టం వాటి ల్లింది. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.


