వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

చేగుంట(తూప్రాన్‌): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో 44వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... చేగుంట మండలం ఉల్లితిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కుకునూరు రాజులు(48) తూప్రాన్‌ నుంచి బైకుపై చేగుంట వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో మాసాయిపేట గ్రామంలో వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో రాజులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రైల్వేట్రాక్‌పై మృతదేహం

రామచంద్రాపురం(పటాన్‌చెరు): రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ఈదులనాగులపల్లి, తెల్లాపూర్‌ రైల్వేస్టేషన్‌ మధ్యలోని రైల్వే అప్‌లైన్‌ ట్రాక్‌పై శనివారం తెల్లావారుజామున గుర్తు తెలి యని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వయస్సు 25నుంచి 35మధ్యలో ఉంటుందని తెలిపారు. మృతుడి కుడి చేతి జబ్బపైన ఎద్దుతల టాటో ఉన్నట్లు పేర్కొన్నా రు. మృతుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వికారాబాద్‌ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement