అదనపు కలెక్టర్ పాండు
సంగారెడ్డి జోన్: నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పాండు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8న నిర్వహించిన జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు ఎంపికై న 137 మంది అభ్యర్థులకు శనివారం కలెక్టరేట్‌లో జాబ్ ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం తుల్జారాం నాయక్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అఖిలేశ్ రెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.


