అనుమానాస్పదంగా కూలీ.. | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా కూలీ..

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

సంగారెడ్డి క్రైమ్‌: ఓ హోటల్‌లో కూలీ పనులు చేసే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... కంగ్టి మండలం చింతామణి తండాకు చెందిన శ్రీకాంత్‌ (22), కొన్ని రోజులుగా పట్టణంలో ఓ హోటల్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం హోటల్‌ గదిలో శ్రీకాంత్‌ మృతదేహం కనిపించడంతో సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు హోటల్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులను వివరణ కోరగా.. ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement