తప్పిపోయిన బాలుడి అప్పగింత | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన బాలుడి అప్పగింత

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

హుస్నాబాద్‌: బస్‌ స్టేషన్‌లో తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన శనివారం హుస్నాబాద్‌ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బస్టాండ్‌లో ఓ బాలుడు ఒంటరిగా తిరుగుతుండటం గమనించిన ఆర్టీసీ సిబ్బంది అతడ్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన గొల్లెన అనిరుధ్‌గా గుర్తించారు. ఈక్రమంలోనే బస్‌ స్టేషన్‌కు చేరుకు బాలుడి తల్లిదండ్రుల వద్ద ఉన్న ఆధారాల ను పరిశీలించారు. అనంతరం కంట్రోలర్‌ మహేందర్‌, సిబ్బంది బాలుడిని అప్పగించారు.

యువకుడిపై దాడి

పటాన్‌చెరు టౌన్‌: ఓ యువకుడిపై ఇద్దరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ముత్తంగి డివిజన్‌కు చెందిన వెంకటరెడ్డి ఈ నెల 22న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓఆర్‌ఆర్‌ సమీపంలోని స్వీట్‌ హార్ట్‌ హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లాడు. అక్కడ నలుగురు యువకులు గొడవ పడుతుండగా ఎందుకు గొడవ పడుతున్నారని అడిగాడు. దీంతో నీకెందుకంటూ ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. అనంతరం వెంకటరెడ్డి తన బైక్‌పై ఇంటికి బయలుదేరగా, కారులో వెంబడించిన సంగారెడ్డికి చెందిన ప్రదీప్‌, చేతన్‌ అతడిని అడ్డగించి బేస్‌బాల్‌ స్టిక్స్‌తో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో వెంకటరెడ్డికి ముఖం సహా శరీరం మొత్తం తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ప్రదీప్‌, చేత న్‌లను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement