కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో స్వామి బావిని తుది మెరుగులతో పర్యాటక శోభ సంతరించుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని దాయరవీధిలో గల పురాతన కట్టడాలైన స్వామి బావి, దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి తుది మెరుగులతో భావితరాలకు తెలిపేలా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేశ్ పాల్గొన్నారు.


