కొత్త పింఛన్లు! | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లు!

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

జూన్‌ 2న ప్రారంభం! 22వేల దరఖాస్తులు పెండింగ్‌ కొత్త దరఖాస్తులకు అవకాశం

నారాయణఖేడ్‌: ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న 50 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు చేయూత పేర నూతన పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికి పింఛన్లు అందజేయాలని యోచిస్తుండగా జిల్లాలో కూడా అర్హులైన వారికి పెన్షన్లు దక్కనున్నాయి. దాదాపు మూడేళ్లుగా నూతన పింఛన్లు మంజూరు కావడంలేదు. మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పింఛను మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్‌ 2న నూతన పింఛన్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లాలో నూతన పింఛన్ల కోసం సుమారు 22వేల మంది దరఖాస్తులు సమర్పించారు.

లాగిన్‌కు అనుమతులు

కొత్త చేయూత పింఛనుదార్ల మంజూరు నేపథ్యంలో ప్రభుత్వ శాఖలకు వెబ్‌ సైట్‌లోకి లాగిన్‌ అయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికై తే ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారు మున్సిపల్‌ కార్యాలయాలను సంప్రదించాలి. ఎంపీడీఓ, ఇటు మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

చేయూత పేర పంపిణీకి చర్యలు

Advertisement
 
Advertisement
Advertisement