పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతీ కాలనీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ వార్డులలో శుక్రవారం అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పాలకవర్గం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడ జీఎంఆర్ మార్గ్‌లో నూతనంగా నిర్మించిన చర్చిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ వార్డు శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ సహకారం, పరిశ్రమల సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. సొంత నిధులతో నియోజకవర్గం వ్యాప్తంగా 30 పైగా చర్చిలు నిర్మించి ఇచ్చినట్లు గుర్తు చేశారు. నూతన చర్చి నిర్మాణానికి సైతం ప్రభుత్వంతో చర్చించి భూమిని కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ పాండు, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, చర్చి ఫాదర్ ఆండ్రూస్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


