జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం డివిజన్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి విఘ్నేశ్‌ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించి ల్యాప్‌టాప్‌ను బహూకరించారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల సంద ర్భంగా విద్యార్థి విఘ్నేశ్ ఐఐటీ జేఈఈ మెయి న్స్‌లో 87.22 స్కోర్‌తో ఉత్తమ ప్రతిభతో ఐఐటీ అడ్వాన్స్‌కు అర్హత సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటాడు. దీంతో ఆ విద్యార్థిని ముఖ్యమంత్రి అభినందిస్తూ ల్యాప్‌టాప్ అందజేశారు. విద్యార్థి కళాశాలకు, డివిజన్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంపై ప్రిన్సిపాల్ శ్రీదేవి, అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు.
పార్టీ కోసం
కష్టపడినవారికి గుర్తింపు
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి
సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన కార్యవర్గ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఆమెతోపాటు ఎస్సీ సెల్ కమిటీ ఉమ్మడి మెదక్ జిల్లా అబ్జర్వర్ రాజ భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఇవ్వడంలో భాగంగానే పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన కార్యకర్తలు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంత్ కిషన్, జిల్లా నాయకుడు రఘు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు హనుమంతు యాదగిరి, ఉపాధ్యక్షుడు శ్రీహరి పాల్గొన్నారు.
కల్లు మత్తులో
వృద్ధుడి బలవన్మరణం
అల్లాదుర్గం(మెదక్): కల్లు తాగిన మైకంలో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన మండల పరిధిలోని కాయిదంపల్లి గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన బెస్త వెంకయ్య(69)కు రోజూ కల్లు తాగే అలవాటు ఉంది. సోమవారం రాత్రి ఎప్పటిలాగే కల్లు తాగిన వెంకయ్య మత్తులో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 09:30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి తాడుతో ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డ్యూటీ డాక్టర్.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
విద్యుదాఘాతంతో
మహిళ మృతి
పటాన్‌చెరు టౌన్: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందింది.ఈ సంఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్ వివరాల ప్రకారం... జనగామ జిల్లా.. జాఫర్‌ఘడ్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెంది న ఎల్లమ్మ (55), భర్త సమ్మయ్యతో కలిసి సుమారు తొమ్మిదేళ్ల క్రితం అమీన్‌పూర్‌కు వల స వచ్చింది. రాజీవ్ గృహకల్ప నర్రెగూడెంలో ఉంటూ జీవనోపాధి కోసం గణేశ్ మండ పం షెడ్ నిర్మాణ పనుల వద్ద కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విద్యుత్ స్తంభం నుంచి చెట్టు మీదుగా విద్యుత్ తీగను వేసి కరెంట్ సరఫరా తీసుకున్నారు. కాగా ఆ విద్యుత్ తీగ తెగిపడి నేలపై ఉండగా, ఎల్లమ్మ నీరు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు దానిపై కాలు పెట్టడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.


