జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

సంగారెడ్డి జోన్‌: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో జనగణనపై అవగాహన కల్పించేందుకు మారథాన్‌ వాక్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మే 10వ తేదీ వరకు స్వీయ గణన నిర్వహించగా, 11వ తేదీ నుంచి ఇంటింటి గణన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. జనగణనలో సేకరించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. దీంతో ప్రభుత్వానికి ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఏర్పడి, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు సంగీత, పాండు, అడిషనల్‌ ఎస్పీ చైతన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మారథాన్‌ వాక్‌లో పాల్గొన్న కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, అదనపు కలెక్టర్లు పాండు, సంగీత, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, తదితరులు

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Advertisement
 
Advertisement
Advertisement