సరికొత్తగా సైక్లింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సరికొత్తగా సైక్లింగ్‌

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

ఖేలో ఇండియాలో భాగంగా వేసవి శిక్షణ శిబిరం

రామాయంపేట(మెదక్‌): జిల్లాకు చెందిన సైక్లింగ్‌ క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి రామాయంపేటకు ఖేలో ఇండియా సైక్లింగ్‌ కేంద్రం మంజూరైంది. ఈ మేరకు వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా కోచ్‌ దండు యాదగిరి యువకులకు సైక్లింగ్‌లో శిక్షణనిస్తున్నారు. జిల్లాలో సైక్లింగ్‌ కేంద్రం ఇదొక్కటే కాగా, ఇక్కడ పలుమార్లు రాష్ట్రస్థాయి పోటీలు సైతం నిర్వహించారు. రామాయంపేట ప్రాంతంలో సైక్లింగ్‌ క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని మంజూరు చేసింది. మండలంలోని దామరచెరువు గ్రామానికి చెందిన జాతీయ సైక్లింగ్‌ క్రీడాకారుడు దండు యాదగిరిని కోచ్‌గా నియమించారు. కార్యాలయం ఏర్పాటు నిమిత్తం స్థానికంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రతిరోజూ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.

రామాయంపేటలో ఏరా్ౖపటైన

సైక్లింగ్‌ కేంద్రం

Advertisement
 
Advertisement
Advertisement