ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి
సిద్దిపేటకమాన్: నేడు ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకరు సంతాన లేమితో బాధపడుతున్నారు. అనేక రకాల కారణాలతో వివాహమైన చాలా ఏళ్ల తర్వాత కూడా సంతానం కలగడం లేదు. ప్రతి మహిళకు జీవితంలో అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఉంటుంది. ఆధునిక జీవన శైలి, ఉద్యోగ రీత్యా జంక్, ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల పీసీఓఎస్, ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ వస్తాయి. ఇవి అండం విడుదల కాకుండా చేస్తాయి. అందుకే మహిళలు మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడంతో పాటు ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. మాతృత్వ వైద్యంతో పాటు మంచి ఆహారం తీసుకోవాలి. పాలకూర, బీట్‌రూట్, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గింజలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తినాలి. రోజూ 30 నిమిషాల నడక, యోగా, 7గంటల నిద్ర అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడకం, కెఫీన్, ఆల్కహాల్ పూర్తిగా నిషేధించాలి.
– డాక్టర్ అరుణ, ప్రముఖ గైనకాలజిస్టు


