వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

రామాయంపేట(మెదక్‌): తల్లిదండ్రులు మందలించారని ఒకరు, భార్యతో గొడవపడి మరొకరు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ బాల్‌రాజ్‌ కథనం మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామానికి చెందిన చిన్నవాలి లక్ష్మణ్‌(18). రామాయంపేటలోని బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. పని మానుకొని చదువుకోవాలని అతని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో సంఘటనలో దామరచెరువు గ్రామ శివారులో ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిస్సాకు చెందిన మహాదేవ్‌ (35) అనే కూలీ తన భార్యతో గొడవపడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు కేసులకు సంబంధించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement