వివాహిత అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

పటాన్‌చెరు టౌన్‌: వివాహిత అదృశ్యమైన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కి చెందిన కై లాష్‌ కుమార్‌ భార్యతో కలిసి బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం వచ్చాడు. ఇక్కడే ఉంటూ కార్పెంటర్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారం రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మనీషా కనిపించలేదు. వెంటనే ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో సమీపంలో తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement