ఎండ నుంచి ఉపశమనం
రామాయంపేట(మెదక్): వేసవి సెలవుల్లో చిన్నారులు తమ మిత్రులతో కలిసి ఈత కొట్టడానికి చెరువులు, కుంటల వద్దకు వెళుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి విద్యార్ధులు స్విమ్మింగ్ పూల్స్ (ఈత కొలను)లను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలో ఉన్న ఈత కొలనుల్లో సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారులు ఈత కొట్టడానికి వీలుగా మూడు ఫీట్ల లోతు స్విమ్మింగ్ పూల్ ఉంది. దాని పక్కనే యువకులు ఈత కొట్టడానికి వీలుగా ఐదున్నర ఫీట్లలోపు ఉన్న మరో ఈత కొలను ఉంది. ప్రతి రోజు కనీసం 50 నుంచి 60 మంది యువకులు వస్తున్నారు. వేసవి సెలవులు ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడుపుతున్నారు.


