అదనపు కలెక్టర్‌గా సంగీత బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌గా సంగీత బాధ్యతల స్వీకరణ

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

సంగారెడ్డి జోన్‌: అదనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ)గా టి.ఎల్‌.సంగీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఆమెకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం రెవెన్యూ శాఖ అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని సంగీత చెప్పారు.

సజావుగా కొనుగోళ్లు

అదనపు కలెక్టర్‌ పాండు

పుల్‌కల్‌(అందోల్‌)ః ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగాలని అదనపు కలెక్టర్‌ పాండు నిర్వహకులకు సూచించారు. పుల్‌కల్‌, గొంగ్లూర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించి పరిశీలించారు. హామాలీల కొరతతో కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ధాన్యం రాశులు ఎక్కడికక్కడ కుప్పలుగా పడివున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తూకం, రికార్డుల నిర్వహణ, తేమశాతాన్ని పరిశీలించారు. కళ్లాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా, ధాన్యం రవాణకు వాహనాల కొరత రాకుండా చూడాలని నిర్వహకులకు సూచించారు. అదనపు కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ కృష్ణ ఉన్నారు.

అథ్లెటిక్స్‌ మీట్‌లో

అన్నచెల్లెళ్ల ప్రతిభ

జహీరాబాద్‌ టౌన్‌: హైదరాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ జింఖానగ్రౌడ్‌లో బుధవారం నిర్వహించిన సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో అన్నచెల్లెళ్లు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. ఈ మేరకు బుధవారం జాదవ్‌ ప్రకాశ్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. కోహీర్‌ మండలంలోని షెడగుట్ట తండాకు చెందిన జాదవ్‌ ప్రకాశ్‌ కూతురు జాదవ్‌ సులోచన జహీరాబాద్‌ పట్టణంలోని బ్రిలియంట్‌ స్కూల్‌లో 3వ తరగతి చదువుతుంది. కుమారుడు జాదవ్‌ దేవాంశ్‌ హకీంపేట టీజీఎస్‌ఎస్‌ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. జింఖానాగ్రౌండ్‌లో జరుగుతున్న సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో అన్నాచెల్లెళ్లిద్దరూ పాల్గొన్నారు. అండర్‌–10 బాలికల 60 మీటర్ల రన్నింగ్‌లో జాదవ్‌ సులోచన ప్రతిభచూపి స్వర్ణపతకం, అలాగే లాంగ్‌జంప్‌లో కాంస్యం పతకం సాధించింది. అండర్‌–12 బాలుర విభాగం లాంగ్‌జంప్‌లో జాదవ్‌ దేవాంశ్‌ రజత పతకాన్ని సాధించారు.

అనుమతుల్లేని పాఠశాలలపై క్రిమినల్‌ కేసులు

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌ డిమాండ్‌

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: అనుమతుల్లేకుండా నడుస్తున్న ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేశ్‌ మాట్లాడుతూ..జిల్లాలో అనుమతుల్లేని ప్రైవేటు పాఠశాలల యజమానులు ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. జహీరాబాద్‌ డివిజన్‌ కేంద్రంలో వుడ్‌రాక్‌ వరల్డ్‌ స్కూల్‌ యాజమాన్యం నర్సరీ ఫీజు రూ.85 వేల నుంచి 1.50లక్షల వరకు వసూలు చేస్తున్నా విద్యాధికారులు కళ్లుమూసుకుంటున్నారని విమర్శించారు. సంగారెడ్డి, జహీరాబాద్‌ , పటాన్చెరు,నారాయణఖేడ్‌ డివిజన్‌ పరిధిలో కూడా పర్మిషన్‌ లేని ప్రవేటు నడుస్తున్నాయన్నారు. అనుమతి లేని పాఠశాలలను గుర్తించి మూసేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement