హత్నూర(సంగారెడ్డి): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వసంతరావు పేర్కొన్నారు. హత్నూర, దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఉపాధి కూలీలకు ఓఆర్‌ఎస్ అందించడంతోపాటు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని చెప్పారు. హత్నూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో త్వరలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు.


