గోదాంలలో నిలువ చేస్తాం: | - | Sakshi
Sakshi News home page

గోదాంలలో నిలువ చేస్తాం:

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

మార్కెట్‌లో

మొక్కజొన్న

కుప్పలు

సైబర్‌ మోసాలపై జర జాగ్రత్త

ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

సంగారెడ్డి: ప్రతీ ఒక్కరికీ సైబర్‌ మోసాల పట్ల అవగాహన తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ పేర్కొన్నారు. సైబర్‌ జాగరూకత దివాస్‌ పేరుతో రాష్ట్ర పోలీసు శాఖ ఏర్పాటు చేసిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సంగారెడ్డి నర్సింగ్‌ కళాశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో టౌన్‌ సీఐ రామునాయుడు, సైబర్‌ సెల్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ రాజలింగగౌడ్‌లు విద్యార్థులకు సైబర్‌ నేరాలపట్ల అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాలకు గురవుతున్న వారిలో అధికంగా విద్యావంతులే ఉంటున్నారన్నారు. ఐపీఎల్‌ పేరుతో నకిలీ ఐడీలతో టికెట్స్‌ పేరిట మోసాలు, మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌, నకిలీ ట్రేడింగ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల, ఇన్వెస్ట్మెంట్‌ ఫ్రాడ్స్‌, డిజిటల్‌ అరెస్ట్‌, లోన్‌ అప్‌ వంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఎవరూ భయపడాల్సిన పనిలేదని చెప్పారు. ఆన్‌లైన్‌లో తెలియని లింక్స్‌, ఫైల్స్‌ ఓపెన్‌ చేసి మోసపోవద్దని సూచించారు. సైబర్‌ నేరాలకు గురైతే వెంటనే 1930కు కాల్‌ గాని, ఎన్‌సీఆర్‌బీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుశీల పాల్గొన్నారు.

– రామ్మూర్తి, ఆర్డీఓ, హుస్నాబాద్‌

మార్కెట్‌ యార్డుకు అనుకున్న స్ధాయికి మించి ధాన్యం వస్తోంది. వ్యవసాయ క్షేత్రంలోనే ధాన్యాన్ని ఆరబెట్టి తేవాలని సూచించాం., అయినా రైతులు ధాన్యాన్ని తీసుకురావడంతో కొనుగోళ్లల్లో జాప్యం జరుగుతోంది. లారీల సమస్య, గన్నీ బ్యాగుల కొరత కారణంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య తీరే వరకు ధాన్యాన్ని కొనుగోళ్లు చేసి గోదాంలకు తరలిస్తాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.

Advertisement
 
Advertisement
Advertisement