హుస్నాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగవని, తక్షణం వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ నుంచి మున్సిపల్ వరకు అన్ని ఎన్నికల్లో ఓడిపోయి కేటీఆర్‌కు మతి భ్రమించిందన్నారు. రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్ ఎక్కడిదన్నారు. రైతులకు బేడీలు వేయడం, మల్లన్నసాగర్, గౌరవెల్లి రైతుల మీద విచక్షణ రహితంగా లాఠీచార్జి చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెడితే సభ నుంచి తప్పించుకొని వెళ్లిపోయారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఇది వారికి ఏటీఎంగా మారిందని మోడీ, నడ్డా, అమిత్‌షా ఆరోపణలు చేసిన విషయం మరిచిపోయారా? అని అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బీఆర్‌ఎస్‌తో సంబంధం లేకుంటే తెలంగాణ ప్రభుత్వం వేసిన సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతోందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్


