● వేసవిలోనూ ఎండని ప్రాజెక్టు ● పెరిగిన భూగర్భ జలాలు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ మండలంలోని నారింజ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎండలు మండుతున్నా నారింజలో పుష్కలంగా నీరు ఉంది. ప్రాజెక్టులో నీరు నిలువ ఉండటంతో చుట్టుపక్క గ్రామాల్లోని వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం పడిపోవడం లేదు. ముఖ్యంగా కొత్తూర్(బి),దిడ్గి, మల్కాపూర్, బుర్దిపాడ్, బూచినెల్లి, మిర్జాపూర్(బి), రేజింతల్ తదితర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుదలకు దోహదపడుతుంది. బోరుబావుల్లో నీరు ఉండటంతో వాణిజ్య పంటలైన చెరకు, అల్లం, కూరగాయాలను రైతులు పండి స్తున్నారు. నారింజ ప్రాజెక్టు ప్రభావం జహీరాబాద్ పట్టణంపై కొంతఉంది. నారింజలో నిండుగా నీరు ఉండటంతో పట్టణంలోని బోర్లలో నీరు అడుగంటడంలేదు. దీంతో పట్టణంలో నీటి ఎద్దడి సమస్య తప్పింది.


