బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

పార్టీ కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి

హత్నూర(సంగారెడ్డి): దేశ అభివృద్ధి బీజేపీ పాలనలోనే సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. సోమ వారం బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హత్నూర మండలం దేవులపల్లిలో పార్టీ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తున్నాయని చెప్పారు. బీజేపీ పాలనలోనే దేశం పురోగతి సాధించింన్నారు. గ్రామాలకు కూడా పార్టీ విస్తరిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు నాగ ప్రభుగౌడ్‌, నాయకులు మల్లారెడ్డి, మహేష్‌, మల్లేశం, నాగరాజుగౌడ్‌, పాండు, ఇంద్రసేనారెడ్డి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement