జోగిపేట(ఆందోల్): పదో తరగతి మూల్యాంకనం, కులగణన పారితోషికం చెల్లించనందుకు నిరసనగా మంగళవారం ఉపాధ్యాయ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏ.మాణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. భోజన విరామ సమయంలో అన్ని స్పాట్ కేంద్రాలలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 2025 మార్చిలో మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం, కులగణన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన విధులు పూర్తయి 18 నెలలైనా పారితోషికం చెల్లింపులు జరపకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. పడవ తరగతి స్పాట్‌రేట్లు కనీసం 50 శాతం పెంచాలని, అలాగే ఈ సంవత్సరం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మాణయ్య


