ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు: నిర్దేశించిన గడువులోగా రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని సాయి అంబికా కాలనీ నుంచి ఐలాపూర్ తండా వరకు, లాలాబాయి కాలనీ నుంచి బొల్లారం ఇండస్ట్రీయల్ ఏరియా వరకు రూ.3.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన రహదా రుల నిర్మాణం ద్వారా ఆయా కాలనీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఈఈ సురేష్ పాల్గొన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సోమ వారం సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోక్సో, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామన్నారు. లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించా రు. వారి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. ఎవరికై నా న్యాయ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి కార్యాలయాన్ని సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.


