నీ వెంటే నేను..
సంగారెడ్డి టౌన్: వానరాలు గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాదు రోడ్లపై వెళ్లే వాహనదా రులను సైతం ఇబ్బందులకు గురి చేస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. సోమవారం సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా వానరం అతడి భుజాలపై కూ ర్చుంది. బైక్‌పై కొద్దిసేపు అలా వెళ్లింది. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. కోతి విన్యాసాలను చూసిన ప్రతి ఒక్కరు ఒక్కో రకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వానరా ఏమి కోరిక అంటూ ఫొటో కింద క్యాప్షన్ జత చేస్తూ వైరల్ చేశారు.


