రూ.63 లక్షలు వడ్డీలేని రుణాలు
ఎంపీ.సురేశ్ షెట్కార్
జహీరాబాద్ టౌన్: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జహీరాబాద్ ఎంపీ.సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. పట్టణ సమీపంలో గల పస్తాపూర్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం మహిళా సంఘాలకు రూ.63లక్షల వడ్డీలేని రుణాలను చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం మంజూరు చేసిన వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారులుగా ఎదగాలన్నారు.
వ్యాపారవేత్తలుగా ఎదగాలి: ఎమ్మెల్యే
పెద్దశంకరంపేట(మెదక్)/నారాయణఖేడ్: స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం వడ్డీ రాయితీతో అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకాంక్షించారు. పెద్దశంకరంపేటలో మంగళవారం కల్యాణలక్ష్మి, రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.25 లక్షలతో మరమ్మతుల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్‌హాల్‌లో వడ్డీ రాయితీ కింద ఖేడ్ మండలానికి రూ.78.77లక్షలు, మనూరుకు రూ.32.34లక్షలు, నాగల్‌గిద్దకు రూ.22.28లక్షలు, సిర్గాపూర్‌కు రూ.39,08లక్షలు, కంగ్టికి రూ.35.37లక్షలు, కల్హేర్‌కు రూ.48.81లక్షలకు సంబంధించిన చెక్కులను స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి అందజేశారు.


