అక్రమాలకు పాల్పడితే చర్యలే
మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరిక
నర్సాపూర్: జిల్లాలో ఇసుకను అక్రమంగా తవ్వి తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ ఇసుక బజార్‌ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇందిరమ్మ లబ్ధిదారులకు, ప్రభుత్వ ప్రాజె క్టులు, నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా స్థానిక ఇసుక బజార్‌లో స్టాకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా పూర్తిగా ఆన్‌లైన్ విధానం ద్వారానే అనుమతించాలని, టిప్పర్ల కదలికలు, ఇతర వివరాలు ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్‌డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్‌లు ఉన్నారు.


