
రాష్ట్రస్థాయి పోటీలకు ఖాదిరాబాద్ విద్యార్థులు
వట్‌పల్లి(అందోల్): మండల పరిధిలోని ఖాదిరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి అండర్–17 వాలీబాల్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఇటీవల మండల స్థాయిలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ పోటీల్లో ఖాదిరాబాద్ విద్యార్థులు వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరచి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. దీనిలో భాగంగానే నారాయణఖేడ్ పట్టణంలో జరిగిన పోటీల్లో పాల్గొని గుమ్మడిదల జట్టుపై విజయం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.దిగంబర్‌రావు, పీఈటీ ఎల్.సంగ్రాంలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
జిల్లా స్థాయి క్రీడా పోటీలకు..
జహీరాబాద్: త్వరలో జిల్లా స్థాయిలో జరగనున్న వాలీబాల్ పోటీలకు జహీరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు అబ్దుల్ రహీం, మునీరుద్దీన్ ఎంపికయ్యారు. ఈ మేరకు అల్గోల్ మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జె.రాములు, ఇన్‌చార్జి కె.ఎస్.జమీల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. ఖేడ్‌లో నిర్వహించిన పోటీల్లో అండర్–17 విభాగంలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. పీఈటీ అనిల్‌కుమార్, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్‌గౌడ్, విద్యార్థులను వారు అభినందించారు.
ట్రోఫీతో విద్యార్థులు, ఉపాధ్యాయులు
జిల్లాస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఖాదిరాబాద్ విద్యార్థులు