
యువత.. ఫిట్‌నెస్ మంత్ర
నయా ట్రెండ్
నిత్యం ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా యువత ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇనుప ఖండరాలు, ఉక్కు నరాలు ఉన్న యువత దేశానికి అవసరమంటూ స్వామి వివేకానంద చెప్పిన మాటలు స్ఫూర్తిగా తీసుకున్నారో లేక నయా బాడీ ట్రెండో చెప్పలేం కాని యువకులు జిమ్‌ల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో యువత ఫిట్‌నెస్‌పై ఈ వారం కథనం. – దుబ్బాక/దుబ్బాకటౌన్ :
జిమ్‌లో సాధన చేస్తున్న యువకులు
శిక్షకుల సూచనల మేరకు..
ఉదయం, సాయంత్రం వేళలో జిమ్‌లలో శిక్షకుల సూచనల మేరకు సాధన చేస్తున్నారు. మారుతున్న నేటి సమాజంలో మధ్య వయస్సు వారు సైతం బీపీ, షుగర్ బారిన పడుతున్నారు. దీంతో వారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉదయం వాకింగ్ చేయడంతో పాటు జిమ్‌లలో వర్కౌట్లు చేస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు.
సిక్స్‌ప్యాక్‌పై ఆసక్తి
ఆరోగ్యానికి ప్రాధాన్యం
శరీరాకృతి కోసం కసరత్తు
సెలబ్రిటీలను అనుసరిస్తున్న యువకులు
ఉమ్మడి జిల్లాలో
వందల సంఖ్యలో జిమ్‌లు