
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
పటాన్‌చెరు టౌన్: కంటైనర్ కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కర్ణాటక గుల్బర్గా నుంచి మెహదీపట్నంకు ఓ కుటుంబం కారులో వస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కర్దనూర్ సమీపంలో కొల్లూరు వైపు వెళ్తున్న కంటైనర్ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఐదుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆసిఫ్, అబ్దుల్ బషీర్ బేగం, ఆయేషా, జబ్బిన్ బేగం, ముదా షేర్, రహమతున్నీసాకు తీవ్ర గాయాలయ్యాయి. మరో చిన్నారి క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడింది. వెంటనే ఔటర్ అంబులెన్స్ క్షతగాత్రులను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.