
మద్యానికి బానిసై.. జీవితంపై విరక్తి చెంది..
వట్‌పల్లి(అందోల్): ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అందోలు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... చింతకుంట గ్రామానికి చెందిన బాలరాజు(23) తండ్రి చనిపోగా తల్లి వద్దే ఉంటున్నాడు. ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్న అతడు కనిపించకుండా పోయి పది రోజులు కావస్తుంది. కౌలు రైతు శనివారం ఉదయం చెట్టుకు కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం వేలాడుతూ ఉండడాన్ని చూసి జోగిపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ పాండు తన సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కాగా ఘటనా స్థలంలో ద్విచక్రవాహనాన్ని చూసి బాలరాజు మృతదేహంగా గుర్తించారు. మృతుడు మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఉరేసుకున్నట్లు భావిస్తున్నారు.
మనస్తాపంతో భర్త..
మునిపల్లి(అందోల్): భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బుదేరా ఎస్‌ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... మండలంలోని మేళసంగ్యం గ్రామానికి చెందిన బేగరి బాలయ్య (47), భారతమ్మ దంపతులు కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. బాలయ్య తరచూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. కాగా ఈ నెల 7న భార్యతో బాలయ్య మద్యం తాగడానికి డబ్బులు కావాలని గొడవపడ్డాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన అతడు రెండు రోజుల క్రితం ఇంట్లోని బాత్ రూంలో ఉరి వేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు, భార్య భారతమ్మకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి బాలయ్య విగతజీవిగా పడి ఉన్నాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..
జహీరాబాద్ టౌన్: వైన్స్ పర్మింట్ రూం వద్ద వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి మృతి చెందాడు. పట్టణ సమీపంలోని భరత్‌నగర్‌కు చెందిన సంగెం అనిల్‌గౌడ్(37) మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. మద్యం తాగే అలవాటు ఉన్న అనిల్‌గౌడ్ శుక్రవారం ఇంటి నుంచి వెళ్లాడు. పట్టణంలోని ఓ వైన్స్ పర్మింట్ రూం వద్ద పడి ఉన్నాడు. ఆయన నుదిటిపై గాయాలు ఉన్నాయి. స్థానికులు గమనించి ఆయనను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు పేర్కొ న్నారు. భర్త మృతి పట్ల భార్య సరిత అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై.. జీవితంపై విరక్తి చెంది..