
జోగిపేట ఆస్పత్రిలో ఆస్కి వైద్య బృందం
జోగిపేట(అందోల్): ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అందులోభాగంగా జోగిపేట ఆస్పత్రి వద్ద ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయమై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) వైద్యులు గురువారం జోగిపేట ఏరియా ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలు, పరికరాలు, అవసరమైన సదుపాయాలను పరిశీలించి నివేదిక తయారు చేశారు. ఆస్పత్రికి సంబంధించిన పలు వివరాలను సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య వారికి వివరించారు. బృందం సభ్యుల్లో వైద్యులు అభిషేక్, శ్రీ హర్ష, మేఘన,దివ్య, మౌనిక, కీర్తి ఉన్నారు.