
పెట్టుబడి కూడా రాదు
సొంత భూమితో పాటు మరో 20 ఎకరాలు ఇద్దరం కలిసి కౌలుకు తీసుకుని పత్తి వేశాం. విత్తనం నాటిన తర్వాత వర్షాలు పడకపోవడంతో తిరిగి మళ్లీ నాటాం. కాయ, పూత కాస్తున్న సమయంలో వర్షాలు పడటంతో ఆశలు ఆవిరయ్యాయి. దీంతో సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. నష్ట పరిహారం మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలి.
– బగిలి బక్కన్న, రైతు, తాటిపల్లి
నివేదిక పంపించాం
వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి పంట వివరాలను నమోదు చేసుకుని సంబంధిత అధికారులకు 10 రోజుల క్రితం నివేదిక పంపించాం. వర్షాలు తరచూ పడుతుండటంతో మరింత పత్తి నష్టం జరిగే అవకాశం ఉంది. పంట నష్టపరిహారం రాయడానికి వర్షం సమయం ఇవ్వడం లేదు.
– శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి

పెట్టుబడి కూడా రాదు