
వాటర్ ట్యాంక్ శుభ్రం చేయరూ?
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని గడి మోహల్‌లో గల మినీ వాటర్ ట్యాంక్ అస్తవ్యస్తంగా తయారైంది. నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్‌ను శుభ్రం చేయడం లేదని, దీంతో లోపల బయట పాకురు(నాచు)పేరుకుపోర ుుందని స్థానికులు వాపోతున్నారు. దోమలు, నీటిలో ఉండే కీటకాలు అందులో వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఓ సారి శుభ్రం చేయాల్సి ఉన్నా... పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి ట్యాంక్‌ను శుభ్రం చేయించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.
వర్గల్(గజ్వేల్): జఠాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (జేఈటీ) అకాడమీ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డుకు వర్గల్ జెడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు అమరవాది రాజశేఖరశర్మ ఎంపికయ్యారు. రాష్ట్రంలో 50 మంది ఉపాధ్యాయులను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కాగా సోమవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి ఆద్యా, అనీష్ ఆంథోని చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నట్లు అమరవాది తెలిపారు.
నారాయణఖేడ్: ట్రైన్ ద ట్రైనర్ కార్యక్రమంలో అద్భుత ప్రతిభ కనబర్చిన మనూరు మండల కేంద్రానికి చెందిన సిద్ధారెడ్డి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు గంప నాగేశ్వర్‌రావు చేతులమీదుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందుకున్నాడు. హైదరాబాద్‌లోని హోటల్ కాకతీయలో లయన్ ట్రైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. పబ్లిక్ స్పీకింగ్, లైఫ్, టెక్నికల్, పర్సనల్ డెవలప్‌మెంట్ స్కిల్స్ తదితర అంశాలపై శిక్షణనిచ్చారు. సిద్ధారెడ్డి పలు అంశాల్లో తన అద్భుత ప్రతిభను కనబర్చారు.
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా... మండలంలోని శాలిపేట గ్రామానికి చెందిన బుస్స రమేశ్ బైక్‌పై చిన్నశంకరంపేట నుంచి గవ్వలపల్లి వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో మెదక్ వైపు నుంచి వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రమేశ్ కాలు విరగడంతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడ్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
● భర్త మృతి
● భార్య, కూతురికి తీవ్ర గాయాలు
పటాన్‌చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య, కూతురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం... కంది మండలం.. ఎర్దనూరుకు చెందిన కృష్ణ(44) తన పల్సర్ బైక్‌పై భార్య కవిత, కూతురు శ్రీ వాణితో కలిసి రుద్రారం గ్రామ పరిధిలోని గణేశ్ గడ్డ దేవస్థానం నుండి ఇస్మాల్‌ఖాన్‌పేట్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది.ఈ ఘటనలో కృష్ణ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, కూతురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

వాటర్ ట్యాంక్ శుభ్రం చేయరూ?

వాటర్ ట్యాంక్ శుభ్రం చేయరూ?